టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజం కాదా?

22 Nov, 2022 18:15 IST|Sakshi

తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్‌లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్నారని, మరి వారిది బూతులు పార్టీ కాకుండా ఏంటని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజం కాదా? అని మంత్రి నిలదీశారు. మంగళవారం తాడేపల్లి నుంచి మాట్లాడిన మంత్రి జోగి రమేష్‌.. ‘ నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజమే కదా?, చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు మాట్లాడారు. మరి వారిది తెలుగు బూతుల పార్టీ కాకుండా ఏంటి?, అన్నం పెట్టిన తల్లిని, పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ని తన్నించిన వ్యక్తి చంద్రబాబు.

అలాంటి వ్యక్తిని ఏ మాటలతో సంబోధించాలి?, టీడీపీ చచ్చిపోయిన పార్టీ. ఆ పార్టీని పాడె మీద మోసుకుని వెళ్తుంటే దాన్ని రక్షించుకోవడానికి చంద్రబాబు అందరి కాళ్లు నాకుతున్నాడు . బాదుడే బాదుడే కార్యక్రమానికి  స్పందనే లేదని వాళ్ల రివ్యూ లోనే తేలిపోయింది. జగన్‌ని ఢీకొట్టాలంటే చంద్రబాబు బలం చాలదు. 2019 ఎన్నికలలో చంద్రబాబుని ప్రజలు చెప్పుతో కొట్టారు. బట్టలు ఊడదీసి కొట్టిస్తానని చంద్రబాబు ఈ వయసులో మాట్లాడుతున్నారు.

గత ఎన్నికలలో చంద్రబాబుకు అదే జరిగిందన్న సంగతి మర్చిపోయారా?, పప్పుసైకో సైతం జగన్ గురించి కారు కూతలు కూయటం సిగ్గుచేటు. అసలు కుప్పంలో కూడా ఈసారి చంద్రబాబు గెలవడు.మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే దీనికి రుజువు. చంద్రబాబు మాకు అవసరం లేదని జనమే అనేక ఎన్నికలలో తేల్చి చెప్పారు. అందుకే అధికారం కోసం చంద్రబాబు సైకోలాగ మారారు.  2014లో మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ హామీ అమలు చేయనందునే జనం ఓడించి పంపారు. బీజేపీ, జనసేనతో కలిసి జనాన్ని నిలువునా మోసం వేశారు. ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికీ పంపి సమస్యలు తెలుసుకుంటున్న నాయకుడు జగన్ మాత్రమే. అందుకే 2024 ఎన్నికలలో మళ్ళీ టీడీపీ ని తరితరిమి కొట్టడం ఖాయం’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు