2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?: మంత్రి జోగి రమేష్‌

31 May, 2022 18:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సామాజిక న్యాయ భేరీ యాత్రలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ లక్షల మంది ఘన స్వాగతం పలికారని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. '16 జిల్లాల గూండా సాగిన బస్సు యాత్రకు జయహో జగనన్న అంటూ ప్రజలు నినదించారు. 75 ఏళ్ల చరిత్రలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మూడేళ్ల కాలంలో సామాజిక న్యాయం ఏ విధంగా ఉంటుందో చేసి చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఒక ఆలోచన, కృతజ్ఞతా భావం పెరిగింది. ప్రజల మనసుల్లో పెద్దఎత్తున జగనన్న మంచి స్థానం కల్పించుకున్నారని మాకు యాత్రలో స్పష్టంగా తెలిసిందని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు. 

'చంద్రబాబు ఒక మాయలపకీరులా మహానాడును తిట్ల పురాణంతో నిర్వహించాడు. అయ్యన్నపాత్రుడు తాగొచ్చి మాట్లాడుతున్నాడా...?. బలహీన వర్గాలు టీడీపీకి పట్టుకొమ్మ అన్నమాట పటాపంచలు అయ్యింది. జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన అభినవ పూలే వైఎస్ జగన్. నామినేటెడ్ పదవులు, వర్క్‌లలో 50 శాతం మాకు అందించాడు. 25 మంది మంత్రుల్లో 17 మంది బడుగు బలహీన వర్గాల వారే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయితే సామాజిక న్యాయ నిర్ణేత వైఎస్ జగన్' అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 

చదవండి: (సూపర్‌స్టార్‌ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌)

నువ్వేరోజైనా బీసీలకు రాజ్యసభ ఇచ్చావా..?
నువ్వు మహానాడులో బీసీలకు ఏమి చేశావో చెప్పలేక బూతు పురాణం అందుకున్నావు. మేము బీసీలకు ఏమి చేశామో స్పష్టంగా చెప్తున్నాం. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవికే చెప్పులరిగేలా తిరిగే రోజు నుంచి రాజ్యసభ స్థాయికి బీసీలను ఆదరించారు. నువ్వేరోజైనా బీసీలకు రాజ్యసభ ఇచ్చావా..?. వర్ల రామయ్యకు ఇస్తానని నీ సామాజిక వర్గానికి ఇవ్వలేదా. 2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?. ప్రజలంతా జగనే కావాలి.. జగనే రావాలి అని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇక్కడి సామాజిక న్యాయాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేలా డిమాండ్స్ వస్తున్నాయి. ప్రజావ్యతిరేకత ఈ ప్రభుత్వంపై ఎందుకుంటుంది..?.

1.40 లక్షల కోట్ల రూపాయలు సీఎం టు సీఎం (కామన్ మ్యాన్)కి వెళ్లాయి. మధ్యలో ఎవరైనా ఉన్నారా.. మీలా జన్మభూమి కమిటీలు ఉన్నాయా..?. రైతన్నలకు రైతు భరోసా సకాలంలో ఇస్తుంటే ఎక్కడుంది వ్యతిరేకత..?. 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటే వ్యతిరేకత ఉంటుందా...?. మంత్రివర్గంలో 75 శాతం బడుగు బలహీనులకు మంత్రి పదవులు ఇస్తే వ్యతిరేకత వస్తుందా...?. మేధావులు అందరూ ఆలోచన చేస్తున్నారు.. ఇలాంటి సామాజిక న్యాయం ఎన్నడూ చూడలేదని అంటున్నారు. 2019లో మాకు వ్యతిరేకంగా పనిచేసిన వారు కూడా 2024లో మాకు అండగా పనిచేసెందుకు సిద్దంగా ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు కంటే.. జగన్ నిజం చేసి చూపించారు. 

చదవండి: (ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు: మంత్రి మేరుగ నాగార్జున)

17 కాదు 18 మందికి మంత్రిపదవులు ఇస్తానని చెప్పగలవా ..?
జనరల్ స్థానాల్లో సైతం బడుగు బలహీనర్గాలను పోటీ చేయించిన ఘనత సీఎం జగన్‌ది. మహానాడుకు నువ్వు కోట్లు కుమ్మరించి ఉంటావ్.. మాకు ఒక్క పిలుపు చాలు. నీకు దమ్ముంటే నేను 17 కాదు 18 మందికి మంత్రిపదవులు ఇస్తానని చెప్పగలవా ..?. నువ్వు ఏమీ చేయలేవు.. తిట్టించడం తప్ప. పాదయాత్రకు వెళ్తే.. ప్రజలు ఛీ కొట్టి పంపుతారు. గడప గడపకు వెళితే చంద్రబాబును కుమ్ముడే కుమ్ముడు అని ప్రజలు చెప్తున్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకాన్నైనా చేస్తానని చంద్రబాబు మహానాడులో చెప్పాడా. పేదవారికి డబ్బులు పంచుతున్నారని ఏడుస్తున్నారు. పేదలకు కాకుండా ఎవరికి పంచాలి చంద్రబాబు...?. నువ్వు నీ అబ్బాయి ఎన్ని పొర్లు దండాలు పెట్టినా 2024లో మిమ్మల్ని ఇక అండమాన్ పంపిస్తారు. మహానాడు సాక్షిగా నువ్వు ఏమీ చేసి చూపిస్తాను అని చెప్పగలిగావు..?. పథకాలను తీసేస్తాను అంటూ పేదవాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్తున్నావా..?. పేద వాళ్ల పొట్ట కొట్టడానికి బ్యాంకులకు లెటర్స్ రాస్తున్నారు.. ఎంత దుర్మార్గులు మీరు...? అంటూ మంత్రి జోగి రమేష్‌ చంద్రబాబు అండ్‌ కోపై మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు