‘ఆయన మానసిక స్థితి బాలేదు.. మైకేల్‌ జాక్సన్‌ తరహాలో ప్రచారాలు’

24 Dec, 2022 17:22 IST|Sakshi

నెల్లూరు: చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మైకేల్‌ జాక్సన్‌ తరహాలో ప్రచారాల్లో పాల్గొంటున్న బాబు ఏవోవో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి విమర్శించారు. వ్యవసాయం దండగన్న బాబు.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదన్న వ్యక్తి చంద్రబాబని, రైతులను కాల్చి చంపిన ఘన చరిత్ర బాబుదని మంత్రి కాకాణి ధ్వజమెత్తారు.

‘పదవి.కోసం ఎంత కైనా చంద్రబాబు దిగజారుతాడు. అవసరం ఉన్నపుడు మోదీ ని పొగిడి,అవసరం తీరగానే విమర్శలు చేశాడు. రాహుల్ గాంధీని సీపీఎం, సీపీఐలను కూడా కలుస్తాడు. ఎవరితో అవసరమైతే వారితో జత కట్టడం అవసరం తీరగానే వారిని వదిలేయడం చంద్రబాబుకు అలవాటే. కుప్పం నియోజకవర్గానికి రెవిన్యూ డివిజన్ కూడా తెచ్చుకోలేక పోయాడు. దాన్ని కూడా సీఎం జగన్‌ ఇచ్చారు. లోకేష్‌ను విదేశాల్లో ఎవరి ఖర్చు తో చదివించారో చెప్పాలి. నీ కొడుకు ప్రయోజకుడు కాకపోవడంతోనే దత్త పుత్రుడు పై ఆధార పడుతున్నాడు. ఉత్తరాంధ్ర విలన్ చంద్ర బాబు’ అని విమర్శించారు మంత్రి కాకాణి. 

మరిన్ని వార్తలు