'ఆయన బ్యాంక్‌ అకౌంట్‌లు కూడా బ్లాక్‌ చేయించిన నీచుడు చంద్రబాబు'

20 Nov, 2022 18:23 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: కర్నూలులో న్యాయరాజధాని వస్తే తమప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆనందంలో అక్కడి  ప్రజలు ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అందుకే వాళ్లు బాబుని అడ్డుకొని గోబ్యాక్‌ నినాదాలు చేశారన్నారు. జగన్‌ ప్రజల హృదయాలకు దగ్గరయ్యేసరికి చంద్రబాబుకి పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. ఎవరైనా అతనిని మెంటల్‌ ఆస్పత్రిలో చూపించాలన్నారు. ఈ మధ్య చంద్రబాబు కొత్తగా తొడగొట్టడం కూడా మొదలు పెట్టాడు. ఈ వయసులో అలాంటివి అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యేసరికి బాబుకి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయి అన్నారు.

అమరావతి రాజధాని కాకపోతే లక్షల కోట్లు పోతాయనే బెంగ పట్టుకుందన్నారు. బాబు ఎక్కడికెళ్లినా తన భార్యను అవమానించారంటూ సింపతీ కోసం చూస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులు వెరిఫై చేసి నిరూపించు చంద్రబాబు అని సవాల్‌ విసిరారు. మేము చంద్రబాబు భార్యను ఒక్కమాట అన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతగా విరమించుకొంటాను అని సవాల్‌ చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్‌ని క్షోభ పెట్టి, ఆయన బ్యాంక్‌ అకౌంట్‌లు కూడా బ్లాక్‌ చేసిన నీచుడు చంద్రబాబు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్‌.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి)

మరిన్ని వార్తలు