‘ముసుగు తొలగింది.. టెంట్‌ హౌస్‌ పార్టీ మరోసారి అద్దెకు సిద్ధం’

8 May, 2022 20:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సుభిక్ష పాలనను అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని దుయ్యబట్టారు.
చదవండి: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్‌ కౌంటర్‌

‘‘చంద్రబాబు, పవన్‌ మధ్య ముసుగు తొలగిపోయింది. తన టెంట్‌ హౌస్‌ పార్టీని మరోసారి అద్దెకు ఇచ్చేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్‌ అభిమానులు తనను సీఎం చేసుకోవాలని చొక్కాలు చించుకుంటుంటే. పవన్ కల్యాణ్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి చొక్కాలు చించుకుంటున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు అవమానించినప్పుడు.. ఇదే పవన్ కల్యాణ్‌ ఎక్కడికి వెళ్లారు’’ అని మంత్రి ప్రశ్నించారు.


 

మరిన్ని వార్తలు