బీజేపీపై విమర్శలు చేయండి.. పక్క దేశాలను పొగడకండి: కిషన్‌ రెడ్డి కౌంటర్‌

18 Jan, 2023 20:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ఖమ్మం సభకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సభకు విచ్చేసిన ప్రతీ నేతకు, కార్యకర్తకు, ‍ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుపేరునా థ్యాంక్స్‌ చెప్పారు. ఇక, ఈ సభా వేదికగా కేంద్రంలోకి బీజేపీ, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కేసీఆర్‌ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ మీటింగ్‌ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. బీజేపీపై విమర్శలు చేయండి కానీ.. దేశంపై విమర్శలు వద్దు. పక్క దేశాలను పొగడటం, భారత ఆర్మీని తిట్టడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ మేకిన్‌ ఇండియా వల్లే వచ్చింది. దేశంలో ప్రధాని సీటు ఖాళీగా లేదు. కల్వకుంట్ల కుటుంబాన్ని పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కి పంపించాలి. 

మేకిన్‌ ఇండియా వల్ల రైళ్లు, విమానాలు తయారు చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కరెంట్‌ ఉత్పత్తి పెరిగింది. జల వివాదాల పరిష్కారాలకు ఎందుకు మీటింగ్‌కు రాలేదు. హైదరాబాద్‌ను డల్లాస్‌, కరీంనగర్‌ను ఇస్తాంబుల్‌ చేస్తానన్న కేసీఆర్‌.. ఎందుకు చేయలేదు?. ప్రధాని మోదీ వ్యాపారాలు చేయడం లేదు. లిక్కర్‌ బిజినెస్‌ అంతకన్నా చేయడం లేదు. ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని.. నిన్ను చూసి నేర్చుకోవాలా?. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. మీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీటింగ్‌కు వచ్చిన ఒక్కరూ కూడా బీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడలేదు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు