KTR Challenge: బీజేపీ నేతలకు సవాల్‌ విసిరిన మంత్రి కేటీఆర్‌

27 Jun, 2022 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్న బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తోంది ఎంత.. కేంద్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎంత అన్న దానిపై కమలం పెద్దలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల కంటే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు రుజువు చేస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.
చదవండి: దేశంలో మోదీ రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ అక్రమాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలతో విపక్షాలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. దేశంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం లేదని, మోదీ రాజ్యాంగమే అమలవుతోందన్నారు. బీజేపీ నిరంకుశత్వ తీరును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే సిన్హా  మద్దతు కోరుతూ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతామని కేటీఆర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు