ఇది కేవలం ట్రైలరే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్‌

10 Jan, 2023 16:42 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సెస్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతు కృతజ్ఞత సభలో మాట్లాడారు.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 8 ఏళ్లలో కేంద్రానికి రూ.3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చామని, తిరిగి తెలంగాణకు ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్‌ అన్నారు. మిగతా 2 లక్షల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.

సెస్‌లో గెలవని వాళ్లు, రాష్ట్రంలో గెలుస్తారా? అంటూ బీజేపీ నాయకులపై మంత్రి విమర్శలు గుప్పించారు. సెస్‌ ఎన్నికల్లో మీరు చూసింది ట్రైలర్‌ మాత్రమేనన్నారు. అసలు సినిమా త్వరలో చూపిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
చదవండి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు