ప్రధాని మోదీకి ఆస్కార్ ఇవ్వాలి.. మహానటుడు: కేటీఆర్‌ వ్యంగ్యస్త్రాలు

15 Mar, 2023 16:32 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా అని ప్రశ్నించారు. విద్యుత్‌, సాగునీరు ఇక్కడ పుష్కలంగా అందిస్తున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ పోరాటమని గుర్తు చేశారు. అక్కడ( కర్ణాటక, మహారాష్ట్ర) రైతుబీమా, క‌ల్యాణ‌ల‌క్ష్మి, మిష‌న్ భ‌గీర‌థ వంటి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా..? అనే విష‌యాన్ని ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని సూచించారు. 

కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం పిట్లంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. గిరిజ‌న తండాల‌ను, గూడెల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా చేశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్ల‌ను అభివృద్ధి చేస్తాం. గిరిజ‌నుల‌కు స‌ర్పంచ్‌లుగా అవ‌కాశం క‌ల్పించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుందన్నారు. బిచ్కుంద‌, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామని, మిగ‌తా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని ప్ర‌క‌టించారు.

చిత్త‌శుద్ధితో ప‌ని చేసేవారిలో హ‌న్మంత్ షిండే ఒక‌రు
హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఈ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదృష్ట‌వంతులు. మంచి నాయ‌కుడు దొరికిన‌ప్పుడు గ‌ట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గ‌త ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగ‌మ‌డుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్య‌త మీపై ఉన్న‌ది. ప్ర‌జ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధితో ప‌ని చేసేవారు కొంద‌రే ఉంటారు. అందులో ఒక‌రు హ‌న్మంత్ షిండే. అలాంటి నాయ‌కుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

‘తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు దేశాన్ని పాలించి కాంగ్రెసోళ్లు ఏం చేశారు..? పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పడంలో, నటనలో ప్రధాని మోదీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మహానటుడు మోదీ.  దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమ చేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడు. 

2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లముఖం వేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి. తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. తెలంగాణకు పట్టిన శని బీజేపీ. మోడీ ఈడీలకు భయపడం. ప్రజాక్షేత్రంలో  తూల్చుకుందాం. కేసీఆర్‌ను పాడుకుని. మూడోసారి సీఎం చేసుకుందాం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 
చదవండి: ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్‌

మరిన్ని వార్తలు