White Challenge: నేను పరీక్షకు సిద్ధం.. రేవంత్‌ లైడిటెక్టర్‌ టెస్ట్‌కు రెడీనా: కేటీఆర్‌

20 Sep, 2021 09:51 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ పేరిట మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డికి సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని.. రాహుల్‌ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌ వేదికగా రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. 

‘‘ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే.. రాహుల్‌ వస్తాడా. చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీన్‌చిట్‌ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్‌ క్షమాపణ చెప్తాడా.. ఓటుకు నోట్ల కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. డ్రగ్స్‌ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి సిద్ధం కావాలన్నారు. తాను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానన్న రేవంత్‌ అటు నుంచి ఏ ఆసుపత్రి అంటే ఆ హాస్పిటల్‌లో డ్రగ్స్‌ టెస్ట్ చేసుకుందాం అన్నారు. డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకుని యువతకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు.

చదవండి: ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్‌ మర్మమేమిటి?

మరిన్ని వార్తలు