కేటీఆర్‌ సెటైర్‌, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే!

6 Jul, 2022 09:48 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం వంటిట్లో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలపై కేటీఆర్‌ స్పందించారు.

బీజేపీని విమర్శిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. "అచ్చేదిన్ ఆ గయే. బధాయి హో" ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. భారతీయ కుటుంబాలకు మోడీ జీ బహుమతి ఇదేనంటూ సెటైర్లు వేశారు.   

అప్పుడు వాట్సాప్‌ యూనివర్సిటీ అంటూ 
మంత్రి కేటీఆర్‌ సందర్భానుసారం బీజేపీపై విమర్శల దాడిని పెంచుతూనే ఉన్నారు. పెరిగిన గ్యాస్‌ ధరలపై అచ్చేదిన్‌ ఆగయే అంటూ ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. మొన్న జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

జులై 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలపై ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్‌ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.


థ్యాంక్యూ డియర్‌ మోదీ జీ
ఏప్రిల్‌ నెలలో దేశ జీడీపీపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. దేశ జీడీపీ పెరగడం లేదని ఎవరన్నారని ప్రశ్నించారు. థ్యాంక్యూ డియర్‌ మోదీ జీ. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వెల్లడించారు.

జీడీపీ పెరుగుదలను ప్రధాని మోదీ రోజువారీ అలవాటుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించాలనే మోదీ వ్యూహమా అని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు