KTR: మోదీ ఓ అసమర్థ ప్రధాని.. కార్పొరేట్ల కోసమే పాలన

25 Jan, 2023 04:06 IST|Sakshi
భలే ఉన్నాయి: ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన చింతకాయలతో మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి తదితరులు 

కార్పొరేట్‌ సంస్థలకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారు

ఇది నిజం కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కేటీఆర్‌

దమ్ముంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇప్పించండి

నారాయణపేట సభలో బీజేపీ నేతలకు కేటీఆర్‌ సవాల్‌

సాక్షి, నారాయణపేట: మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిందని.. ఇది నిజం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అంటారు.. అది నిజం కాదు. కేవలం అదానీ, అంబానీ కోసమే మోదీ పాలన కొనసాగుతోందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పేదలకు రావాల్సిన పైసలన్నీ మోదీ దోస్తులు అదానీ, అంబానీలకు చేరుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్‌ సంస్థలకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచిస్తే దేశంలో రైతాంగానికి రూ.14.50 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చన్నారు. మంగళవారం నారాయణపేటలో మంత్రులు మహముద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో కలిసి రూ.196కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

అనంతరం సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానమంత్రుల పాలనలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం రూ.వంద లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ హోదాను ఇప్పించాలని సవాల్‌ విసిరారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. కృష్ణాజలాలపై  ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ తెంపని అసమర్థత ప్రభుత్వం కేంద్రానిదేనని నిందించారు. ’’మహబూబ్‌నగర్‌లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందంట కదా... తెలంగాణకు 500 టీఎంసీల నీటిని ఇవ్వాలనీ, ఈ ఏడాది కేంద్రబడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తూ పాలమూరు–రంగారెడ్డికి జాతీయహోదాను ఇప్పించాలని అక్కడి నుంచి కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపండి’’ అని సలహా ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలకు వెన్నముక ఉంటే ఈ పనులు చేయాలని సవాల్‌ విసిరారు.

ఆదాయం కాదు.. కష్టాలు డబుల్‌ అయ్యాయి
‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్‌ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్‌ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్‌ అయ్యాయి...’’ అని కేటీఆర్‌ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్‌ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ  కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్‌ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్‌ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

మోదీ ఓ అసమర్థ ప్రధాని
‘నరేంద్రమోదీ ఓ అసమర్థ, పనికి మాలిన ప్రధాని అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్న దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతూ రూ.30లక్షల కోట్లు అదనంగా గుంజింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ’’పీఎం కష్టపడి కరోనా వ్యాక్సిన్‌ కనుగొన్నారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటుండు. ఎంత హస్యాస్పదమండి... మోదీ చూ మంత్రం వేస్తే కరోనా వ్యాక్సిన్‌ తయారైందంట...శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు వారంతా ఎందుకున్నట్లు.’ అని కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆదాయం కాదు.. కష్టాలు డబుల్‌ అయ్యాయి
‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్‌ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్‌ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్‌ అయ్యాయి...’’ అని కేటీఆర్‌ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్‌ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ  కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్‌ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్‌ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా నారాయణపేటలో సీనియర్‌ సిటిజన్లకో పార్కు
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్‌ సిటిజన్ల కోసం నారాయపేట జిల్లాకేంద్రంలో ఓ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన సీనియర్‌ సిటిజన్‌ పార్కును మంత్రి ప్రారంభించి అద్భుతమంటూ కితాబునిచ్చారు. ఈ పార్కును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కేటీఆర్‌ అభినందించారు. పార్కులో ఉన్న ఓ చెట్టుకు విరగకాసిన చింతకాయలను చూస్తూ మంత్రి కేటీఆర్‌ భలే కాశాయని ముచ్చట పడ్డారు. అంతలోనే చెట్టు చింతకాయను ఓ ప్రజాప్రతినిధి తీసుకువచ్చి ఇవ్వగా కేటీఆర్‌ వాటిని తింటూ భలేగా ఉన్నాయంటూ అందరినీ ఊరించారు.

మరిన్ని వార్తలు