ఓర్వలేకే ఆ రాతలు: కన్నబాబు

5 Oct, 2020 19:41 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉంటే ఈనాడు పత్రిక ఓర్వలేకపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు దేశంలో ఎవ్వరు చేయనంత మేలు తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, చంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు ఏనాడైనా ఈనాడు పట్టించుకుందా? అని ప్రశ్నించారు. (చదవండి: ‘చంద్రబాబుకు తెలిసింది ఒకటే’)

‘‘సీఎం జగన్‌ హయాంలో రైతులకు భరోసా ఇస్తున్నాం. 16 నెలల్లోనే 10,200 కోట్లు రైతులకు ఇచ్చిన ప్రభుత్వం మాది. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు కల్పిస్తున్నాం. కరోనా కష్ట కాలంలో కూడా గిట్టుబాటు ధరలు కల్పించాం. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు విత్తనాలు, ఎరువులు గ్రామాల్లోని అందిస్తున్నాం. రైతుల కోసం ఇంత మేలు చేసే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?. ఈనాడుకు ఈ ప్రభుత్వం చేసే మేలు కనిపించదా..? అని కన్నబాబు నిలదీశారు. (చదవండి: ప్రజలు చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదు)

సూక్ష్మ సేద్యాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నది అబద్ధమని, దానిలోని లోపాలు సరిదిద్దుతున్నామని ఆయన వివరించారు. రైతులకు అవసరమైన ఏ పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదని ఆయన స్పష్టం చేశారు. 4 వేల కోట్ల తో జలకళ పథకం చేపడుతున్నామని, తొలిసారిగా ఉచితంగా బోర్లు, మోటార్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. సూక్ష్మంగా వెతికి ఆరోపణలు చేద్దామనుకోవడం సమంజసం కాదని కన్నబాబు హితవు పలికారు.

మరిన్ని వార్తలు