Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

26 Aug, 2021 03:24 IST|Sakshi
మీడియా సమావేశంలో తొడగొట్టి సవాల్‌ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి 

దమ్ముంటే రాజీనామా చెయ్‌..

రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘నువ్వు అబద్ధాలు, బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాల్లో నంబర్‌ వన్‌ కదా. రేపు నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్‌ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్‌ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘ఆయన పార్లమెంటులో నా కాలేజీ మీద ప్రశ్న అడిగాడు. నేను మచ్చలేని మహారాజును.. తప్పు చేయకుండా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించా. నీలాగా బ్లాక్‌మెయిల్, సమాచార హక్కు చట్టం అడ్డు పెట్టుకుని అ క్రమాలు చేయలేదు. పాలు, పూలు అమ్ముడు త ప్పా. నన్ను బ్రోకర్, జోకర్‌ అన్నందుకే స్పందిస్తున్నా’అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ‘దళిత ఆత్మ గౌరవ సభలు అం టూ నువ్వు చెడి పోయి మమ్మల్ని చెడ గొడతవా.. మా నోట్లో మన్ను పో స్తవా అని స్థానికులు తిట్టారు. సర్కస్‌లా గా టెంట్‌ సామాను తెచ్చి ఐదేసి వందలు ఇస్తే వచ్చిన వాళ్ల ముందు తిట్టడమే రేవంత్‌ పనిగా పెట్టుకున్నాడు. నాలుగు పార్టీలు మారి పైసలిచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నావు. పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరూ దిక్కులేకనే.. నీకు పదవిస్తే పైసలు వసూలు చేసి పార్టీని నడిపిస్తావని ఇచ్చారు’అని మల్లారెడ్డి అన్నారు. ‘సీఎం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నా కనపడతలేదా.. 17 లక్షల కుటుంబాలకు దళితబంధు తరహాలో ఇతరులకు కూడా అమలు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. అంబేడ్కర్‌ తర్వాత మా కేసీఆరే’అని మల్లారెడ్డి అన్నారు.  

చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్‌ ఎందుకివ్వరు?

మరిన్ని వార్తలు