రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్‌

25 Apr, 2023 16:13 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడులో దళితులపై పిచ్చి రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై చంద్రబాబు పిచ్చి వాగుడును ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘దళితులు ఏం పీకుతారని లోకేష్‌ అన్నప్పుడు రామోజీ ఎందుకు రాయలేదు?. లోకేష్‌కు కూడా దళితులు అంటే లోకువ’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.

‘‘ఎస్సీలు మీటింగ్‌ పెట్టి మాట్లాడుకుంటే ఎల్లో మీడియా విషం చిమ్ముతుంది. చంద్రబాబు హయాంలో దళితులను కొట్టినా.. చంపినా రాయలేదు. 14 ఏళ్లు దళితులే టార్గెట్‌గా చంద్రబాబు పాలన చేశారు. గజదొంగలను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను అభాసుపాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. సీఎం జగన్‌ దళితుల కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశారు’’ అని మంత్రి నాగార్జున అన్నారు.
చదవండి: చంద్రబాబు లెగ్గు మహిమ.. సైకిల్‌ నాలుగు ముక్కలు

మరిన్ని వార్తలు