‘చంద్రబాబు కుప్పం ప్రజలకు న్యాయం చేయలేదు’

30 Aug, 2021 16:40 IST|Sakshi

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

సాక్షి, చిత్తూరు: కుప్పం రైతులకు సాగునీరు ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన పాలనలో కుప్పం ప్రజలకూ న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగు, తాగునీరు అందించారని గుర్తుచేశారు. విద్యాకనుక పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు మించిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని  పేర్కొన్నారు. 

చదవండి: విశాఖ రాజధానికి టీడీపీ అనుకూలమా? కాదా?: మంత్రి అవంతి

మరిన్ని వార్తలు