రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి

23 Apr, 2023 13:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్  ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం.

ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి.
(ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా?)

నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు