చంద్రబాబు ఓటమిని అంగీకరించాలి

18 Feb, 2021 12:30 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి  హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం, రెండోదశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ గెలిచిందన్నారు. కుప్పంలో టీడీపీ కుప్పకూలిందని, వైఎస్సార్‌సీపీ 75 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. కుప్పంలో టీడీపీ 14 స్థానాలకే పరిమితమైందన్నారు. కుప్పంలో టీడీపీకి వచ్చిన 14 స్థానాలూ అరకొర మెజార్టీతో వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు.

‘‘కుప్పంలో మేం చేసిన అభివృద్ధే విజయానికి కారణం. చంద్రబాబు.. కుప్పంలోనే మెజారిటీ సాధించలేకపోయారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి. తన పదవి నుంచి తప్పుకుంటే బాగుంటుంది.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని’’ మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.
చదవండి: చంద్రబాబుకు భారీ షాక్‌: కుప్పంలో టీడీపీ ఢమాల్‌

మరిన్ని వార్తలు