‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’

18 Sep, 2021 15:01 IST|Sakshi

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, చిత్తూరు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు పలికారు.

చదవండి:
‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’
గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్‌

మరిన్ని వార్తలు