చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం: మంత్రి పెద్దిరెడ్డి

8 May, 2022 14:40 IST|Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి.. సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు.
చదవండి: ఎల్లో చానెల్‌లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు

మరిన్ని వార్తలు