Peddireddy Ramachandra Reddy: ‘ఇదేం దిగజారుడు రాజకీయం బాబు.. అంతా హాస్యాస్పదం’

12 May, 2022 12:59 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
చదవండి: నారాయణ ‘లీక్స్‌’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..

మీటర్లు బిగిస్తే ఉరితాడు అంటూ.. రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. కరోనా సమయంలో కూడా పేదలకు మేలు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు