వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

20 Sep, 2022 17:20 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌తో కలిసి పర్యవేక్షించారు. 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయాడంటూ ఫైర్‌ అయ్యారు. కుప్పంను మున్సిపాలిటీతో పాటు, రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.

కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నారన్నారు. ఎన్నికల నాటికి హంద్రీనీవా కాలువల పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తి పడి హంద్రీనీవా పనులు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుంది'అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

చదవండి: (చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా ఆర్‌ఎం భాషా)

మరిన్ని వార్తలు