‘ఏడాదిలోనే హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది’

10 Apr, 2021 22:03 IST|Sakshi

నెల్లూరు: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడాది కాలంలోనే అమలు చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  ఇలా ఎన్నికల హామీలను ఏడాది కాలంలో అమలు చేసిన నేత దేశంలోనే ఎవరూ లేరని,  ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

38లక్షలకు ఇళ్ల స్థలాలు  ఇవ్వడంతో పాటు,  నాడు-నేడు కార్యక్రమంలో ద్వారా స్కూళ్లకు అద్భుతమైన రూపు ఇచ్చామనన్నారు. గూడురులో శనివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.  సాగునీటి ప్రాజెక్ట్‌లను అవిశ్రాంతంగా పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కెల మాటలకు జనం చెల్లుచీటి ఇచ్చారన్నారు.

ఇక ఈ సభలో పాల్గొన్న మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ..  ‘అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టకతో వచ్చిన విద్య. తిరుపతిలో  తండ్రీ కొడుకులు ప్రచారం చేసినా లాభం లేదు’ అని విమర్శించారు. ఇక ఎంపీ మోపీదేవి మాట్లాడుతూ.. ఎన్నికలంటే టీడీపీ భయం పట్టుకుందన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా. గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు