‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఊరూరా ఈదుకుంటూ వెళ్లారా?’

26 Nov, 2021 09:24 IST|Sakshi

చంద్రబాబు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు..

మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: జనం బాధల్లో ఉంటే.. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, ‘‘చంద్రబాబుది పరామర్శ యాత్రా?.. రాజకీయ యాత్రా?. చంద్రబాబు చాలా హేయంగా మాట్లాడుతున్నారు. ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. వరద బాధితులను ఓదార్చకుండా రాజకీయ విమర్శలా?. వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడ తిరిగారు?. చంద్రబాబు సీఎంగా ఉ న్నప్పుడు ఊరారా ఈదుకుంటూ వెళ్లారా?. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలి. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాలని’’ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.

చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన మంత్రి పేర్ని నాని
చిరంజీవీ ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. టికెట్‌ రేట్ల పెంపు అంశం పరిశీలించి నిర్ణయిస్తామని తెలిపారు.
 

చదవండి: వైఎస్సార్‌ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..

మరిన్ని వార్తలు