నాదెండ్ల మనోహర్ చక్కగా కథ నడిపించారు: మంత్రి రోజా

19 Oct, 2022 17:52 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జన సైకోల అధినేత పవన్ కల్యాణ్‌ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పడిపోయిందని మంత్రి రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మీటింగ్‌కు వచ్చారని ఓటింగ్‌కు రాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతి టీడీపీ రాజధాని అన్న మనిషి..ఇప్పుడు మాట మార్చారని ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిని ప్యాకేజీ స్టార్ అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమానికి ఎక్కడా ర్యాలీ చేయని పవన్, విశాఖలో ఎందుకు ర్యాలీ చేశారని నిలదీశారు.

పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళడం, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రుల్ని చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినపుడు, ముద్రగడను అరెస్ట్ చేసినపుడు ప్రజాస్వామ్య పరిరక్షణఎక్కడ ఉందని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ అధినేతలను కలపడంలో నాదెండ్ల మనోహర్ చక్కగా కథ నడిపించారని దుయ్యబట్టారు.

‘రాష్ట్రంలో ఇళ్లు లేని చంద్రబాబు, పవన్‌లకు హైద్రాబాదే దిక్కు. టీడీపీ ప్రజల్లోకి వస్తే చెప్పు దెబ్బలు తప్పవు.  అందుకే పవన్‌ను వెంట బెట్టుకున్నారు. ఎప్పుడు లేనిది ఎల్లో మీడియాకు పవన్‌పై ప్రేమ పుట్టుకు వచ్చింది. కాపులకు వైఎస్సార్‌ ఇచ్చిన ప్రాముఖ్యత రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వలేదు. ముద్రగడ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే ఆరోజు చంద్రబాబు చంక ఎక్కిన పవన్ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు. కాపులకు ఏదైనా చేస్తే నీవెంట ఉంటారు. ఏం చేశావని నీ వెంట నడవాలి. జన సైకోలు, జగన్‌ సైనికులకు జరిగే 2024 ఎన్నికల యుద్ధంలో 175 స్థానాలకు గెల్చుకోవడం ఖాయం’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. 

సాక్షి, కర్నూలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాను పవన్‌ పోషిస్తున్నాడని విమర్శించారు. రెండు స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా గెలవలేని పవన్ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  పవన్‌ చీకటి ఒప్పందాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. పవన్‌ పార్టీ ‘జనసేన’నా లేక ‘టీడీపీ సేన’నా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు