బాబును తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు: మంత్రి రోజా

6 May, 2022 19:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గతంలో అధికారంలో ఉండి మీరేం చేశారంటూ చంద్రబాబుపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు వల్లే రాష్ట్రం నాశనమైందన్నారు. బాబును తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు.
చదవండి: చంద్రబాబుకు భయం, బాధ అందుకే.. మంత్రి కాకాణి కౌంటర్‌

మరిన్ని వార్తలు