సిఎం పదవి కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే వ్యక్తి చంద్రబాబు: మంత్రి రోజా

15 Feb, 2024 15:53 IST|Sakshi

 సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్‌ అని మండిపడ్డారు మంత్రి రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని విమర్శించారు. మొన్నటి వరకు రాహుల్‌ గాందీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్‌ షా కాళ్లు పట్టుకుంటున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌లాంటి నాన్‌ లోకల్‌ పొలిటిషియన్‌లకు ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు.

సంక్షేమ రాష్ట్రంగా సీఎం జగన్‌ ఏపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి రోజా. తండ్రి బాటలోనే సీఎం జగన్‌ మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  తండ్రి అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 80 వేలు అందిస్తున్నారని, మైనారిటీ పక్షపాతిగా వక్ఫ్ బోర్డు స్థిర చర ఆస్తులు రక్షణకు అండగా నిలుస్తున్నారన్నారు.

వైఎస్సార్‌ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌లతోపాటు 2024 ఎన్నికల్లో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తమ నియోజకవర్గంలో కోటి 85లక్షలతో షాది మహల్ నిర్మాణం చేయడంతోపాటు మసీదుల మరమ్మత్తులకు రూ. 2 కోట్లు కేటాయించారని తెలిపారు.  మీరా సాహెబ్‌పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

whatsapp channel

మరిన్ని వార్తలు