‘ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు’

3 Oct, 2023 18:48 IST|Sakshi

ఆ రోజు టీడీపీలో పని చేస్తే మంచిదాన్ని

టీడీపీ నచ్చక బయటకొస్తే నన్ను టార్చర్‌ చేస్తున్నారు

టీడీపీలో ఉన్న మహిళలు బండారు వాఖ్యలు స్వాగతిస్తున్నారు

మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరూ ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?

మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు.. టీడీపీ పెట్టిన ఎన్టీఆర్‌ సినిమా వ్యక్తి కాదా?

మంత్రి బండారు భార్య ను అడుగుతున్నా

ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు

కన్నీటి పర్యంతమైన మంత్రి ఆర్‌కే రోజా

సాక్షి,  తిరుపతి: మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీలో నచ్చక బయటకొస్తే తనను టార్చర్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు(మంగళవారం) తిరుపతిలో మీడియా సమావేశంలో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ..‘ లోకేష్‌ నీ తల్లి గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా?,  నీకు ఫ్యామిలీ లేదా.. నీ ఫ్యామిలీని అంటే ఊరుకుంటావా?, దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు. మాజీ మంత్రి బండారు చేసిన వాఖ్యలు పట్ల రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు. టీడీపీలో ఉన్న మహిళలు బండారు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరూ ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?, మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు. టీడీపీ  పెట్టిందే ఎన్టీఆర్  సినిమా ఆయన కాదా.. మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు.

మహిళలు అందరూ ఆలోచన చేయండి.. లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నారు. నేను పదేళ్లు టీడీపీలో పనిచేశా. మహిళ సాధికారతకు పాటుపడుతున్నాను. రాజకీయాల్లో 20 ఏళ్ళుగా ఉన్నా. నేను రాజకీయంగా మంత్రిగా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు.  జయసుధ, జయప్రద, దివ్య వాణి ,శారదా నేను  సినిమా రంగం నుంచి టీడీపీలో పనిచేశాం. ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. నేను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల. లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రాహ్మణి చదువుతోంది. మా నాయకుడు జగన్‌ను అంటే మేము ఊరుకోవాలా?, నన్ను తిట్టించడానికి అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి వారిని ఉసిగొల్పుతున్నారు. మేము ఖండిస్తే, మా క్యారెక్టర్‌లు తప్పుబడుతున్నారు. టీడీపీ అంటే దండు పాళ్యం పార్టీ, తెలుగు దొంగల పార్టీ. 

ఆడ పుట్టుకను అపహాస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి అని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ. మహిళలు అంటే చిన్న చూపు చూసే టీడీపీలో మహిళలు అంటే ఎలా గౌరవం ఉంటుంది. ప్రతి మహిళకు మనస్సు ఉంటుంది, మీకు దమ్ము ఉంటే నా నియోజకవర్గంకు రండి, అభివృద్ధి చూడండి, దానిపై చర్చ చేయండి. నా గొంతు నొక్కలని చూస్తే ఊరుకోను,   పరువు నష్టం కేసు వేస్తా, కోర్టుకు ఈడుస్తా’ అని మంత్రి రోజా స్పష్టం చేశారు.


 

మరిన్ని వార్తలు