వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల: మంత్రి రోజా

13 Feb, 2024 12:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజమని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. పవన్‌ కల్యాణ్‌ మాటలను ప్రజలు నమ్మలేదని.. అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్‌ ఇచ్చి చదివిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతామన్నా పవన్‌కు ఎందుకు కలిశారని మండిపడ్డారు. రేవంత్‌ అవినీతిపరుడు, టీడీపీ కోవర్టన్న షర్మిల.. ఆయన్ను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపిన షర్మిల వైఎస్‌ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని అన్నారు. వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిలని ఎద్దేవా చేశారు.. వైఎస్‌ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్‌ అని పేర్కొన్నారు.  

షర్మిలవి టైమ్‌పాస్‌ రాజకీయాలని మంత్రి రోజా విమర్శించారు. సీఎం జగన్‌పై విషయం చిమ్ముతూ, వైఎస్సార్‌సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్ధేశ్యమని అన్నారు. వైఎస్‌ జగన్‌ను అధికారంలో నుంచి తప్పించి.. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి ప్లాన్‌ అని దుయ్యబట్టారు. అంతేతప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని గానీ, రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచన లేదన్నారు.


చదవండి: Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం

whatsapp channel

మరిన్ని వార్తలు