గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు

9 Nov, 2022 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వానికి గవర్నర్‌ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్‌మెంట్‌ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్‌ లేఖ రాశారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్‌ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్‌ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు.
చదవండి: మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు

మరిన్ని వార్తలు