చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు.. ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ సమయంలో తప్పుడు ప్రచారం చేస్తారా..

2 Mar, 2023 21:20 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్  చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్‌లో ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ జరుగుతున్న  గొప్ప సందర్బంలో  ప్రజలను తప్పుదారి పట్టించేలా  తప్పుడు బుక్‌లెట్స్‌తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌ను వేదించామంటున్నారు. వారికి  మాకు సంబంధం ఏంటి?  చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు.  చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్ని  రిలయన్స్కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు.

చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా  కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్  ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్  వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం  స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం.  చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. 

విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో  వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు.  ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది  పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని  ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. 

మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా  హోదాా  గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం.  పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం  ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు.

స్టాల్స్‌ను పరిశీలించిన విడదల రజిని..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను  ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో
ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు.  రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.
చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు