విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ

17 Oct, 2021 18:16 IST|Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్‌ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్‌ అవసరం లేదు: పేర్ని నాని)

టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య
రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్‌ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్‌ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు.

చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు