టీడీపీ నేతలకు మతిభ్రమించింది: మంత్రి శంకర్‌నారాయణ

10 Aug, 2021 15:09 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అ‍న్నారు. ఎల్లోమీడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. 

రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయలేదా? బాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కాలువ శ్రీనివాస్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్‌దే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు