‘మా సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు’

20 Oct, 2021 13:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఛాలెంజ్‌ హాస్యాస్పదమని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మంచి మనసు సీఎం జగన్‌ది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడంలేదు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

టీడీపీ నేతల భాషను పవన్‌ ఎందుకు ఖండించలేదు..
విజయనగరం: సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీని నిషేధించాలని ఈసీని కోరతామన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్‌ ఆలోచనలే. టీడీపీ నేతల భాషను పవన్‌ ఎందుకు ఖండించలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మట్లాడాలని బొత్స హితవు పలికారు.

టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
గుంటూరు: టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎల్లో మీడియా ఉంది కదా అని అడ్డదిట్టంగా మాట్లాడొద్దన్నారు. సంక్షేమ పాలన ఓర్వలేకే టీడీపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ పథకం ప్రకారమే అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు. పట్టాభి ఒక పెయిడ్‌ ఆర్టిస్ట్‌. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ పట్టాభి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరన్నారు. పట్టాభిని చట్టపరంగా శిక్షించాల్సిందేని మోపిదేవి డిమాండ్‌ చేశారు.

సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్‌
అనంతపురం:
రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేశారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మండిపడ్డారు. పట్టాభిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.


 

మరిన్ని వార్తలు