ఎవరెన్ని కుట్రలు పన్నినా సంక్షేమ పథకాలు ఆపం: వెల్లంపల్లి

24 Jul, 2021 21:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్‌తో కుమ్మక్కై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సంక్షేమ పథకాలు ఆపం అని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గ గుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు