చంద్రబాబుకు ఆ మాట చెప్పే ధైర్యం ఉందా?: మంత్రి వేణు

30 Jan, 2023 18:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

‘‘అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. రుణ మాఫీపై రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?. బాబు అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఏనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’’ అని మంత్రి దుయ్యబట్టారు.

‘‘పెత్తందార్ల కోసం చంద్రబాబు, ఎల్లో మీడియా పని చేస్తోంది. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికీ ప్రయోజనం లేదు. పవన్, చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎంతగా పీడించారో అందరికీ గుర్తుంది. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. లబ్ది పొందిన వారంతా జగన్ వెన్నంటే ఉన్నారు. లోకేష్‌ని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగలడా?. లేదా పవన్ని చేస్తానని చెప్తారా? ఏదీ చెప్పే ధైర్యం లేని వారు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని’’ మంత్రి ఎద్దేవా చేశారు.
చదవండి: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్‌ 

మరిన్ని వార్తలు