‘చంద్రబాబు కుట్రలో భాగమే ఈ అమరావతి పాదయాత్ర’

11 Sep, 2022 17:36 IST|Sakshi

విశాఖ: చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర అని మంత్రి, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా ఇంఛార్జి విడుదల రజని విమర్శించారు.అమరావతి ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి విధ్వేషాలు లేవని, అంతా తెలుగు వారేనని విడుదల రజని తెలిపారు. లోకేష్‌ పాదయాత్ర చేసినా జనం విశ్వసించరని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాల కోసమే చంద్రబాబు అమరావతి పాదయాత్ర పేరిట కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖ, కర్నూలు, అమరావతిలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజధానులుగా గుర్తించారని, ఎన్ని అవాంతరాలు సృష్టించినా మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు వెళుతుందని మంత్రి రజని తేల్చిచెప్పారు. అమరావతి రైతుల పేరిట జరిగే పాదయాత్రలో జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. 

మరిన్ని వార్తలు