దేశం దాటించినా.. చంద్రబాబు తప్పించుకోలేరు: మంత్రి అమర్నాథ్‌

8 Sep, 2023 21:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దొంగ పనులు చేసే చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయకుడదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ నోటీసులకు సంబంధించి ఇద్దరు విదేశాలకు పరారయ్యారని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్, మనోజ్ పార్థసానీని ఎందుకు దేశం దాటించారని ప్రశ్నించారు.  ఒకరిని దుబాయ్, మరొకరిని అమెరికా ఎందుకు పంపించారని నిలదీశారు. వారిని దేశాలు దాటించినా.. చేసిన తప్పు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు.

నేను తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు?
అరెస్ట్‌ పేరుతో చంద్రబాబు సానూభూతి పొందే ప్రయత్నం చ్తేస్తున్నారని మంత్రి అమర్నాథ్‌ విమర్శించారు. చంద్రబాబు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్న లాక్కొస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు చంద్రమడలం వెళ్లిన అరెస్ట్ తప్పదని పేర్కొన్నారు. నేను తప్పు చేయలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై తోడు దొంగలు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.  పవన్, సీపీఐ నారాయణ, పురంధేశ్వరి ఎందుకు మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా ఎందుకు చంద్రబాబు అవినీతిపై కథనాలు రాయడం లేదని ప్రశ్నించారు.
చదవండి: Chandrababu Naidu: ఆ నాలుక ఎలాగైనా మడత పడుద్దీ.!

సమాధానం చెప్పకుండా కుంటి సాకులు
గుంటూరు: చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు అన్న మాట వాస్తవం అని విచారణలో తేలిన తర్వాతే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని నీటి పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఐటీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు కుంటి సాకులు చెబుతున్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవడం చంద్రబాబు అలవాటేనని దుయ్యబట్టారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది
చంద్రబాబు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు అంబటి. యువగళం పాదయాత్రలో తమిళనాడు నుంచి జనాన్ని తీసుకువచ్చి తిప్పుతున్నారని,  పుంగనూరులో లాగా పోలీసులపై దాడి చేయాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  చంద్రబాబు ప్రాజెక్టు దగ్గర ముదరష్టపు కాలు పెట్టడం వల్లే వర్షాలు పడటం లేదని ప్రజలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

‘తప్పు చేశాడు కాబట్టే నోటీసులు బయపడుతున్నాడు. నోటీసులు ఇచ్చిన అధికాకారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు నిర్ధారించుకున్నకే నోటీసులుకు ఇచ్చి ఉంటారు. తప్పు చేస్తే ఎవరినైనా ఎక్కడైనా అరెస్ట్‌ చేశారు. చంద్రబాబనును అరెస్ట్‌ చేస్తారని ఆయనే ప్రచారం చేసుకుంటున్నాడు. ’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు