హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు: మంత్రి కొట్టు

15 Jul, 2023 14:26 IST|Sakshi

సాక్షి, బీఆర్‌ అంబేద్కర్‌ కొనసీమ జిల్లా: హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని విమర్శించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నాడని మండిపడ్డారు.

లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల  వివాహాలు జరుగుతాయని తెలిపారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ చర్యతో బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడటంతో.. వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారని అన్నారు. 
చదవండి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి

‘రోజురోజుకి పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నాడు. చంద్రబాబులాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును వదులుకుంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు. సమాజంలో సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటే దానిని కూడా చూడలేకపోతున్నావు. ప్రజా నాయకుడైన వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబే. గతంలో దేవాలయాలు కూల్చి వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేకపోయావని నిలదీశారు.

వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం కూడా పాటించలేని వ్యక్తి  పవన్‌ కల్యాణ్‌ అని బీసీ సంక్షేమశాఖా మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చే సెఈం జగన్ పట్ల అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూ ధర్మం గురించిపవన్‌ మాట్లాడితే ఎవరు వినరని అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, ప్రాంతాలు, వాలంటీర్ల గురించి మాట్లాడటం పవన్‌ నైజమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్ మీద ఆధారపడిన పవన్‌..  గత ఎన్నికల్లో  ఓచోట గెలిచిన వ్యక్తిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకోలేకపోయాడని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు