‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’

5 Oct, 2022 10:26 IST|Sakshi

మంత్రి ఆర్కే రోజా

సాక్షి, విజయవాడ: అన్ని ప్రాంతాలు బాగుండాలనేదే సీఎం జగన్‌ ఆలోచన అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వికేంద్రీకరణ కోరుతూ విజయవాడలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. ‘సాక్షి’తో మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమరావతి తెచ్చి మోసం చేశారన్నారు. అమరావతి ముసుగులో చంద్రబాబు చేస్తున్నది నకిలీ పోరాటమని మండిపడ్డారు. 29 గ్రామాలకు లక్షన్నర కోట్లు పెడితే 26 జిల్లాలు ఏమవ్వాలని ప్రశ్నించారు.
చదవండి: సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: విజయసాయిరెడ్డి

అమరావతి చంద్రబాబు బినామీల రాజధాని అంటూ రోజా దుయ్యబట్టారు. మేము వాళ్లలా తొడలు కొట్టి రెచ్చగొట్టం. దేవుడికి కొబ్బరికాయలు కొట్టి అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరుకున్నాం. 29 గ్రామాల వాళ్లు జగనన్నను గద్దె దించుతామని అంటున్నారు. 26 జిల్లాల రైతులు చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబుని రాష్ట్రం నుండి తరిమి కొడతారని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు