జన సైకోలు.. ప్లాన్‌ ప్రకారమే మంత్రులపై దాడి..

15 Oct, 2022 18:58 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్‌పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్‌ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు.
-మంత్రి ఆర్కే రోజా

జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు.
-వైవీ సుబ్బారెడ్డి

ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్‌ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య.
-స్పీకర్‌ తమ్మినేని సీతారాం.


చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్‌ హెచ్చరిక

జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్‌పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్‌ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్‌ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..
-మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్‌చల్‌ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్‌ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం.
-హోంమంత్రి తానేటి వనిత

జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్‌ కళ్యాణ్‌ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్‌ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలి.
-మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన

ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్‌ కల్యాణ్‌ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్‌ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్‌ తక్షణమే సమాధానం చెప్పాలి. 
-మంత్రి నారాయణ స్వామి

మరిన్ని వార్తలు