Mizoram Assembly Elections: మిజోరంలో నేడే పోలింగ్‌

7 Nov, 2023 01:12 IST|Sakshi

ఐజ్వాల్‌: మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) మధూప్‌ వ్యాస్‌ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందన్నారు.

149 పోలింగ్‌ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు