తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

7 May, 2021 09:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే.

మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్‌ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14 శాతం ఓట్లు సాధించింది.

స్టాలిన్‌ కేబినెట్‌లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్‌ అవకాశం ఇచ్చారు. దురైమురుగన్, కెఎన్‌. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్‌ బాలాజీ, ఆర్‌. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్‌ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్‌ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్‌ మస్తాన్, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

చదవండి: MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!

మరిన్ని వార్తలు