కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు

27 Oct, 2021 15:42 IST|Sakshi

బద్వేలు (వైఎస్సార్‌ కడప): బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏ ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది.. అంతరించిపోతుంది. అదే విధంగా.. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ప్రస్తుతం దాని ఉనికే లేదని విమర్శించారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

టీడీపీ, జనసేనలు పోటీలో నిలవకుండా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. బద్వేలు బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న బద్వేలుకు ఉప ఎన్నిక జరగనుంది. 

చదవండి: ‘ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదు’

మరిన్ని వార్తలు