బాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలి

25 Oct, 2021 13:20 IST|Sakshi

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపేందుకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు. (చదవండి: టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్‌)

అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్‌ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు.
చదవండి: కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు