రేవంత్‌, భట్టి టార్గెట్‌గా జగ్గారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

19 Nov, 2022 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీపై సంచలన కామెంట్స్‌ చేశారు. జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‌లో మీటింగ్‌ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్‌ మీటింగ్‌ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్‌ మీటింగ్‌ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా?. ఉన్న 10 మంది కూడా గాంధీభవన్‌లో కూర్చోలేని పరిస్థితి. 

కొన్ని ఛానళ్ల భజనతోనే రేవంత్‌కు పీసీసీ దక్కింది. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీ మారే పరిస్థితి ఉంటే రేవంత్‌, భట్టి విక్రమార్క, మహేష్‌ గౌడ్‌ ఏం చేస్తున్నారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్‌లో ఏం చేస్తారు?. మర్రి శశిథర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి మారితే కాంగ్రెస్ చాలా నష్ట పోతుంది. 12 మంది ఎమ్మెల్యేల ను  కాపాడుకోవడం లో ఉత్తమ్ , భట్టి ఫెయిల్‌ అయ్యారు. మునుగోడులో ఓటమిని రేవంత్‌ అంగీకరించాలి. పార్టీ గెలిస్తే క్రెడిట్‌ రేవంత్‌కు, ఓడితే మిగలిన వారికి ఇస్తారా?. 

మాణిక్యం ఠాగూర్ వ్యవస్థను సెట్ చేయడం లేదు. పార్టీలో చాలా ప్రక్షాళన చేయాలి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు వస్తుంది అనుకోవడం తప్పు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ను బలహీనపరచేందుకే టీఆర్‌ఎస్‌, బీజేపీ పొలిటికల్‌ డ్రామాలు చేస్తున్నాయి. మీడియాన డైవర్ట్‌ చేసేందుకే రెండు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నా​యి. నిరుదో​గ్యులకు ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను టీఆర్‌ఎస్‌ మరిచిపోయింది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దాడుల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు