రైతులను టీడీపీ నట్టేట ముంచింది: ఎమ్మెల్యే కాకాణి

9 Jul, 2021 11:26 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రైతుల హృదయాల్లో దివంగత మహానేత వైఎస్సార్‌ నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. రైతు సంక్షేమంపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారని.. రైతులను సీఎం జగన్‌ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. పంటల బీమా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ధ్వజమెత్తారు.

అధికారంలో ఉండగా పంటబీమా ఇవ్వలేక టీడీపీ చతికిలపడిందని, పంట దిగుబడి తగ్గితే బీమా వచ్చేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మిల్లర్లతో చేతులు కలిపి రైతులను టీడీపీ నట్టేట ముంచిందన్నారు. నీతి, నిజాయతీ ఉంటే సోమిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని కాకాణి  సవాల్‌ విసిరారు. వేషాలు వేసి మోసం చేసిన చరిత్ర టీడీపీదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే కాకాణి  హితవు పలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు