చంద్రబాబు.. జీవో నెం1లో ఏముందో అసలు చదివావా?

7 Jan, 2023 13:09 IST|Sakshi

కాకినాడ:  ప్రజల భద్రత, సంరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో నెం1ను చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యగా చిత్రీకరించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అసలు జీవో నెం1లో ఏముందో పూర్తిగా చదివావా అంటూ ప్రశ్నించారు. ఒకసారి జీవో నెం1ను చదవమని చంద్రబాబుకు విజ్తప్తి చేస్తున్న అని ప్రెస్‌మీట్‌ ద్వారా కురసాల పేర్కొన్నారు.

‘కేవలం ఇరుకు రోడ్లు మీద సభలు నిర్వహించుకోవద్దని, అవి చేయాలంటే వేరే ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి జీవోలో చెప్పారు. ర్యాలీలు వద్దని జీవో నెం1 లో ఎక్కడైన పేర్కోన్నారా?,  1861 యాక్ట్‌ అనేది ఇవాళే పుట్టి కొచ్చినట్లు చెబుతున్నారు.చంద్రబాబు ప్రచార చీప్ ట్రిక్ వల్లప్రాణ నష్టం జరగకూడదని జీవో నెం 1 అమలు చేస్తున్నాం. చంద్రబాబు అంటిస్తున్న రక్తపు మరకలను తుడవడానికే జీవో నెం1 ను అమలు చేశారు. చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం జీవో నెం 1 ఇవ్వలేదు. రోడ్డు షోలు, ర్యాలీలు నిషేధిస్తామని ఎక్కడ చెప్పలేదు.

ఇప్పుడు మన దేశంలో..రాష్ట్రంలో అమలు చేస్తున్న చట్టాలు బ్రిటిష్ నాటి చట్టాలే. 2014 తరువాత సెక్షన్ 30ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ళ పాటు అమలు చేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది. ఎల్లో మీడియా చంద్రబాబు భజన కోసమే పుట్టినట్లు ఉంది. మీ పరిపాలనలో ముద్రగడను ఏ చట్టం ఉందని నిర్భందించారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తే చిరంజీని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎందుకు నిర్భంధించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్లో వైఎస్ జగన్ ను ఎందుకు నిర్భంధించారు.’ అని కురసాల నిలదీశారు. 

>
మరిన్ని వార్తలు