వారికి ఎవుసం తెల్వదు

13 Nov, 2021 04:42 IST|Sakshi

మోదీ, బండి సంజయ్‌పై ఎమ్మెల్యే రసమయి ధ్వజం 

ధర్నాలో తీవ్ర వ్యాఖ్యలు 

మానకొండూర్‌: తెలంగాణలో పండించిన ధాన్యా న్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, లేకుంటే మెడలు వంచి కొనిపిస్తామని కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నా రు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాన కొండూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీకి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు ఎవుసం అంటే తెలియదని, అందుకే రైతులతో ఆడుకుంటున్నారని విమర్శిం చారు.

‘యాసంగిలో కేంద్రం వరి పెట్టొద్దని అంటోంది. అదేమైనా నీ జాగీరా.. భూమి నీదా..? భూమి మీద హక్కు నీదా..? మా ఇష్టమున్న పంట పండించుకుంటాం. బాడకవ్‌.. కొంటే కొను.. లేకుంటే కొనబోమని చెప్పు.. ’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 

పెంపుడు కుక్కను ఉసి గొల్పుతున్నారు: ప్రధాని మోదీకి అంబానీ, అదానీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని, అందుకే రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్న రైతులను కేంద్రమంత్రి కారుతో గుద్ది చంపినా పట్టించుకోవడం లేదని రసమయి పేర్కొన్నారు. ‘కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. ప్రాజెక్టులు కట్టుకున్నం. కాల్వలు తవ్వుకున్నం. రైతులకు ఎకరాకు ఐదు వేలు ఇచ్చుకుంటున్నం. ఇలాంటివి చూసి మోదీకి కన్నుకుట్టినట్లయ్యింది.

అందుకే తన పెంపుడు కుక్క బండి సంజయ్‌ని ఉసిగొల్పుతున్నాడు..’అంటూ మండిపడ్డారు. ‘సంజయ్‌ జనంలోకి వచ్చినోడు కాదు. ఏ ఊరిలోనూ తిరిగినోడు కాదు. యాడుంటడో తెల్వదు. భౌ భౌ మని ఒర్రుడు.. పేపర్లో ఫొటో వేసుకునుడు తప్ప ఏం తెల్వదు..’అని ఎద్దేవా చేశారు. యాసంగి పంట కొనేదాకా పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ జీవీ రామక్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు