చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

7 Jun, 2023 13:19 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్‌ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు.

గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్‌ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్‌లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు.

అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు.  గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్‌ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్‌ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ

మరిన్ని వార్తలు